కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) మాజీ సీఎం వైఎస్
జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆదివారం కోడుమూరులో వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల కన్వీనర్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో ఎస్సైకు వినతిపత్రం అందజేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)-2023 ప్రకారం ఎమ్మెల్యేతో పాటు వాటిని ప్రచారం చేసిన వారిపైనా కేసు నమోదు చేసి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.