రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై, ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ కోడుమూరు ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆరోపించారు. శనివారం కోడుమూరులోని చెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం, తిరుపతి లడ్డూలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రఘునాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, తదితర నాయకులు పాల్గొన్నారు.