కోడుమూరు: ఎరువుల పంపిణీని పరిశీలించిన అధికారులు

577చూసినవారు
కోడుమూరు: ఎరువుల పంపిణీని పరిశీలించిన అధికారులు
శుక్రవారం కోడుమూరు మండలంలోని ఉరుకుంద రైతు డిపోలో యూరియా, డీఏపీ ఎరువుల విక్రయాలను అధికారులు పరిశీలించారు. ఏపీఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఎరువుల పంపిణీని తనిఖీ చేసి, యాప్‌లో సాంకేతిక సమస్యలను రైతులకు వివరించారు. యూరియా, డీఏపీతో పాటు కాంప్లెక్స్ ఎరువులను వినియోగించాలని సూచించారు. అవసరమైతే గుర్తింపు పొందిన ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేయవచ్చని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు వాడాలని, లేదంటే పెట్టుబడి నష్టం వస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :