మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ డిమాండ్ చేశారు. గురువారం కోడుమూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, చట్టం అందరికీ సమానం కాబట్టి పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో సాక్షి కార్యాలయంపై దాడి జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని విమర్శించారు.