కోడుమూరు నియోజకవర్గం సి. బెళగల్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన లక్ష్మీపురం శివకుమార్ రెడ్డికి వైద్య చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ పథకం కింద రూ. 2,03,653 చెక్కును కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శనివారం అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శివకుమార్ రెడ్డి సహాయం కోరగా, కేడీసీసీబీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే దస్తగిరి చొరవతో దరఖాస్తు చేయించి ఈ సహాయం అందించారు. చెక్కు అందుకున్న శివకుమార్ రెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి కృతజ్ఞతలు తెలిపారు.