కోడుమూరు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి అనంతరత్నం,
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. శుక్రవారం కోడుమూరులోని
కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిబంధనల పేరుతో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సాంకేతిక కారణాలు చూపి జాతీయ స్థాయి మహిళా నాయకురాలి నామినేషన్‌ను అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహిస్తామని చెప్పే వారు అవకాశం వచ్చినప్పుడు అడ్డుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.