ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో, వేసవిలో పంటల రక్షణ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో సాగు విధానాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. రైతులకు నిరంతర ఆదాయం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.