కౌమార దశలో గర్భధారణను అరికట్టి బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో స్త్రీశిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. బాల్య వివాహాలు, సరైన అవగాహన లేకపోవడం వల్ల చిన్న వయసులోనే గర్భం దాల్చడం జరుగుతోందని, ఇది బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.