కర్నూలు: నిర్లక్ష్య డ్రైవర్‌కి ఏడాది శిక్ష.. జరిమానా

226చూసినవారు
కర్నూలు: నిర్లక్ష్య డ్రైవర్‌కి ఏడాది శిక్ష.. జరిమానా
లారీని నిర్లక్ష్యంగా నడిపి రైల్వే కానిస్టేబుల్ మేకల వెంకటేశ్వర్లు (56) మృతికి కారణమైన డ్రైవర్ జితేంద్రకు కర్నూలు ఎక్సైజ్ కోర్టు న్యాయాధికారి ఎస్. అనిల్ కుమార్ శుక్రవారం ఏడాది కారాగార శిక్ష, రూ. 2వేలు జరిమానా విధించారు. 2017 డిసెంబరు 8న గుత్తిరోడ్‌లో జరిగిన ప్రమాదంలో, అతివేగంగా లారీ నడిపిన డ్రైవర్ వెంకటేశ్వర్ల బైకును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిపై చార్జీషీట్ దాఖలు చేసి, నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్