కర్నూలు: జగన్‌పై సోమిశెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు

245చూసినవారు
కర్నూలు కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్ర, దేశ పరిణామాలపై అవగాహన లేకుండా వైకాపా వర్గాల సమాచారం ఆధారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్యాస్ పంపిణీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయాలపై అవగాహన పెంపొందించుకోవాలంటే నారా లోకేశ్ వద్ద శిక్షణ తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు, లోకేశ్‌పై విమర్శలు చేస్తే తగిన ఫలితం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్