మంగళవారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, సోషల్ టీచర్ సుశీలమ్మల పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ, ఉపాధ్యాయ జీవితం ఆదర్శప్రాయమని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజమని అన్నారు. తాను కూడా నాలుగేళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశానని పేర్కొంటూ, ఉపాధ్యాయులు–విద్యార్థుల బంధం అమూల్యమని చెప్పారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.