పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో 3 ఎకరాల 15 సెంట్ల భూమిని విక్రయిస్తానని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని కర్నూలు మండలం పసుపుల గ్రామానికి చెందిన మహబూబ్ బాషా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. భూమి కొనుగోలు కోసం నగదు చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయకుండా మోసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాషా కోరారు.