పత్తికొండ: అంగన్‌వాడీల్లో సమగ్ర సేవలు అందించాలి: కలెక్టర్

222చూసినవారు
పత్తికొండ: అంగన్‌వాడీల్లో సమగ్ర సేవలు అందించాలి: కలెక్టర్
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, బుధవారం పత్తికొండలో మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సమగ్ర సేవలు అందించాలని, పిల్లలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కేంద్రాల్లో ఉండేలా చూడాలని, నాణ్యమైన భోజనం, విద్యాబోధన, ఆటలు, క్రమశిక్షణ అందించాలని ఆదేశించారు. గుడ్లు, రేషన్ వంటి సరుకులు నాణ్యమైనవే కొనుగోలు చేయాలని, సిబ్బంది ప్రతి నెలా టీహెచ్ఆర్, అటెండెన్స్ వివరాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్