
గొంతులోకి చేప ఇరుక్కుని జాలరి మృతి
ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గొంతులోకి చేప ఇరుక్కుని జాలరి మృతి చెందాడు. దిఘి గ్రామానికి చెందిన అవినాశ్ బిజులి శుక్రవారం చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లాడు. ఓ చేపను పట్టుకొని నోటితో నియంత్రించే ప్రయత్నం చేయగా.. అది ఒక్కసారిగా నోటిలోకి జారి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అవినాశ్ శ్వాస తీసుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేకపోయారు.




