కోడుమూరులో ఇళ్లలోకి డ్రైనేజీ నీటి సమస్యతో ప్రజల ఇబ్బందులు

458చూసినవారు
కోడుమూరులో ఇళ్లలోకి డ్రైనేజీ నీటి సమస్యతో ప్రజల ఇబ్బందులు
గురువారం కోడుమూరు పట్టణంలోని ఇంద్రజిత్ కాలనీలో డ్రైనేజీ నీరు ఇళ్లల్లోకి ప్రవేశించడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నీటితో ధాన్యం, వంట సామగ్రి తడిసిపోయాయని, దుర్వాసనతో పాటు పురుగులు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు. ఎమ్మెల్యే దస్తగిరి స్పందించి, డ్రైనేజీ నీరు ఇళ్లలోకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్