పోలకల్: ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

2402చూసినవారు
పోలకల్: ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
సి. బెళగల్ మండలంలోని పోలకల్ గ్రామంలో మతిస్థిమితం లేని గవాసి ప్రకాష్ (55) అనే వ్యక్తి బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ప్రకాష్, తన సొంత పొలానికి వెళ్లి చింతచెట్టుకు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతూ పొలానికి వెళ్లి చూడగా, మృతదేహం వేలాడుతూ కనిపించింది. మృతుడికి ఇద్దరు భార్యలు, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ఎస్సై వేణుగోపాల్ రాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్