కోడమూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో పట్టుబడి ప్రభుత్వానికి జప్తు చేయబడిన 10 వాహనాలకు ఈనెల 16న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖాధికారి ఎం. సుధీర్ బాబు తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ స్టేషన్ ప్రాంగణంలో వేలం జరగనుంది. వాహనాలను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నిర్ణయించిన ధరల ఆధారంగా వేలానికి ఉంచుతారు. వేలంలో పాల్గొనేవారు నిర్ణయించిన ధరావతు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అత్యధిక ధర పాడిన బిడ్డర్ మిగిలిన మొత్తాన్ని అదే రోజు చెల్లించి వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని, పూర్తి వివరాలకు కోడుమూరు ఎక్సైజ్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.