కోడుమూరు గ్రామపంచాయతీ పరిధిలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి రాముడు సానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ప్రతి ఇంటికి నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే, కేటాయించిన వీధుల్లో పారిశుద్ధ్య పనులు క్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.