పెంచికలపాడులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

472చూసినవారు
పెంచికలపాడులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం
గూడూరు మండలం పెంచికలపాడులో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట రాముడు పాల్గొన్నారు. కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగుల దస్తగిరి ఆదేశాల మేరకు ఎంపీటీసీ మద్దిలేటి, టిడిపి గ్రామ అధ్యక్షుడు తిప్పన్న, కర్ణం చిన్న గిడ్డయ్య, గాదె నాగేష్, తలారి బ్రహ్మయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కురువ వెంకట రాముడు మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతికి కృషి చేసిందని, 'సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు' అనే నినాదంతో వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్