ఉల్చాల: ముస్లింల స్మశాన గోడ కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి

3494చూసినవారు
ఉల్చాల: ముస్లింల స్మశాన గోడ కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి
కర్నూలు రూరల్ మండలం ఉల్చాల గ్రామంలో ముస్లింల స్మశాన వాటిక రక్షణ గోడను రుక్మానందరెడ్డి అలియాస్ బాబు రెడ్డి కూల్చివేయడంతో గ్రామ ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలను ముట్టడించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గోడను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. స్మశాన స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలను అడ్డుకోవాలని, గ్రామంలో మతసామరస్యాన్ని కాపాడాలని కోరారు. అధికారులు జూలై 7న స్థలాన్ని సర్వే చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్