కోడుమూరులో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ

291చూసినవారు
కోడుమూరులో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు, “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా కోడుమూరులో శుక్రవారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ సతీష్ మాట్లాడుతూ, ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి వాటిని కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్