కర్నూలు జిల్లాలో 13 మంది పోలీసు అధికారులకు సత్కారం

1428చూసినవారు
కర్నూలు జిల్లాలో 13 మంది పోలీసు అధికారులకు సత్కారం
కర్నూలు జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన 13 మంది పోలీసు అధికారులను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ శాలువాలు, జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా ఎలాంటి సమస్యలున్నా పోలీసు శాఖను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, పదవీ విరమణ పొందిన అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్