కర్నూలులో లంచం కేసులో 7 ఏళ్లు జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా

572చూసినవారు
కర్నూలులో లంచం కేసులో 7 ఏళ్లు జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా
కర్నూలు జిల్లాలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ బిల్లు కోసం లంచం డిమాండ్ చేసిన జి. నాగభూషణం (అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్) కేసులో కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితుడికి 7 సంవత్సరాల కఠిన కారాగారం, రూ. 2 లక్షల జరిమానా విధించారు. బాధితుడికి రూ. 1. 90 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు. నాగభూషణం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్