గంజాయి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని కర్నూలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 1. 5 కిలోల ఎండు గంజాయితో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ గంజాయి కేసులో అరెస్టయి రిమాండ్కు వెళ్లిన నిందితుడు, బయటకు వచ్చిన తర్వాత తిరిగి అదే అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ రెండోసారి పట్టుబడటం గమనార్హం. కర్నూలు పట్టణంలోని మునగాలపాడు బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె. చంద్రహాస్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు.