కర్నూలు జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన
బీజేపీ అభ్యర్థులను బుధవారం కర్నూలు జిల్లా
బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ పరమహంస ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ సునీత భాయ్ ని, గూడూరు 16వ వార్డు కౌన్సిలర్ అంబమ్మ ని, కర్నూలు నగరపాలక సంస్థ 18వ వార్డు కార్పొరేటర్ కాశి విశ్వనాథ్ ని, 34వ వార్డు కార్పొరేటర్ చింతలపల్లి రామకృష్ణ ని, 44వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి రమాదేవి ని పార్టీ ముఖ్య నాయకులు, పదాధికారులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.