కర్నూలు నగరంలో ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడిన 57 వాహనాలను ఏప్రిల్ 1న ఎక్సైజ్ స్టేషన్ లో వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ మంగళవారం తెలిపారు. ఈ వేలంలో 44 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, 5 కార్లు ఉంటాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేలంలో పాల్గొనాలనుకునేవారు రూ. 5,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో వాహనాలు దక్కించుకున్నవారు రుసుము చెల్లించి వాటిని స్వాధీనం చేసుకోవచ్చు.