కర్నూలులో ప్రమాదకరంగా ఫీట్లు చేసిన ఆటో డ్రైవర్ల అరెస్ట్

442చూసినవారు
కర్నూలులో ప్రమాదకరంగా ఫీట్లు చేసిన ఆటో డ్రైవర్ల అరెస్ట్
కర్నూలు నగరంలో జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఫీట్లు చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లను బుధవారం ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం మూడు ఆటోలు రహదారిపై అతి వేగంగా, నిర్లక్ష్యంగా ప్రయాణించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ఆటోలను గుర్తించి చర్యలు చేపట్టారు. అరెస్టు చేసిన డ్రైవర్లను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్