వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో, రైతులు నకిలీ విత్తనాలు, నాణ్యతలేని ఎరువులు, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. లైసెన్స్ పొందిన డీలర్లు, గుర్తింపు పొందిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. విత్తనాల నమోదు, కొనుగోలు కోసం అధికారిక ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే వినియోగించాలని, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్, పాస్‌వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయవద్దని హెచ్చరించారు.