కర్నూలు మున్సిపల్ ఎన్నికల్లో 44వ వార్డు బిజెపి అభ్యర్థి మీసాల గంగాధర్ భార్య బండారు రమాదేవి గెలుపొందారు. బిజెపి అభ్యర్థి కి 1948 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి మైతాపు లక్ష్మీదేవికి 1330 ఓట్లు వచ్చాయి. దీంతో తమ సమీప ప్రత్యర్థి పై బిజెపి అభ్యర్థి బండారు రమాదేవి 618 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో వార్డులోనీ కూటమి శ్రేణులు తెలుగుదేశం, బిజెపి ,
జనసేన పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రౌండ్ లోను తమ సమీప ప్రత్యర్థులపై ఆధిక్యత కొనసాగించారు.