జిల్లా రగ్బీ పోటీలు ప్రారంభం

565చూసినవారు
జిల్లా రగ్బీ పోటీలు ప్రారంభం
కర్నూలు నగరంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల మైదానంలో జిల్లా రగ్బీ పోటీలను జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు సురేంద్ర ఆదివారం ప్రారంభించారు. క్రీడాకారులు తమ అవకాశాలను మెరుగుపరచుకొని తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు. వచ్చేనెల కర్నూలులో రాష్ట్రస్థాయి సీనియర్స్ రగ్బీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రగ్బీ సంఘం కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు, జిల్లా ప్రైవేట్ పాఠశాల పి.ఈ.టి.ల సంఘము అధ్యక్షులు చిన్న సుంకన్న, రగ్బీ కోచ్ నాగ శ్రీనివాసులు, సుభాన్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్