ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి. శంకర్ శర్మ, ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న ఒలింపిక్ డే ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం హాలులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గత 20 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంబరాలను నిర్వహించడం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కు చెందుతుందని కితాబిచ్చారు. క్రీడారంగంలో నిర్వాహకులు శక్తులుగా మారాలని, అప్పుడే రాటు తేలిన క్రీడాకారులను తయారు చేయవచ్చని సూచించారు.