కర్నూలులో అగ్ని ప్రమాదంలో నలుగురికి గాయాలు

1174చూసినవారు
కర్నూలులో అగ్ని ప్రమాదంలో నలుగురికి గాయాలు
కర్నూలు నగరంలోని స్థానిక పాతబస్తీ బండిమెట్ట అంబాభవాని ఆలయం సమీపంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. శివస్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ పక్కన ఉన్న దీపం తగిలి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో లలితాబాయి, తులసి, కిట్టు, లక్ష్మి సహా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. సమాచారం అందుకున్న కర్నూలు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్