కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నార్కోటిక్ స్టోరేజ్ భవన పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదివారం పరిశీలించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పట్టుబడిన గంజాయి తదితర మాదకద్రవ్యాలను భద్రపరిచేందుకు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు, ఎక్సైజ్ సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, డీసీఆర్‌బీ సీఐ గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.