కర్నూలు డీఎస్పీగా కె. వి. రాఘవేంద్ర బాధ్యతల స్వీకరణ

1151చూసినవారు
కర్నూలు డీఎస్పీగా కె. వి. రాఘవేంద్ర బాధ్యతల స్వీకరణ
శనివారం కర్నూలు సబ్‌డివిజన్ డీఎస్పీగా కె. వి. రాఘవేంద్ర బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఎస్పీగా పనిచేసిన జె. బాబు ప్రసాద్ అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది బదిలీ కావడంతో ఆయన స్థానంలో రాఘవేంద్ర నియమితులయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన రాఘవేంద్ర 1996లో ఎస్సైగా పోలీసు శాఖలో చేరి, 2010లో సీఐగా, 2026 మే 1న డీఎస్పీగా పదోన్నతి పొందారు. కర్నూలు సబ్‌డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్