కర్నూలు కొత్తపేటకు చెందిన విజయలక్ష్మి, తన చిన్న కుమారుడికి విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 50 వేలు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె ఈ ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి డబ్బులు తీసుకున్నప్పటికీ మాట నిలబెట్టుకోలేదని, తనకు ఆర్థిక నష్టం కలిగించారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.