ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, శనివారం కర్నూలు నగరంలోని 42వ వార్డులో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీపీ ఎమ్మెల్యే పి. నాగరాజు యాదవ్, 42వ వార్డు ఇంచార్జి తిమ్మారెడ్డి, స్థానిక సచివాలయం సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్ల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కే. చంద్రకాంత్, వలి తదితరులు పాల్గొన్నారు.