జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషాలు, ఉద్రిక్తతలకు దారితీస్తాయని ఆయన అన్నారు. బీఎన్‌ఎస్–2023 నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేతో పాటు ఆ వీడియోలను ప్రచారం చేసిన వారిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.