కర్నూలు: కిమ్స్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి: డీవైఎఫ్ఐ

583చూసినవారు
కర్నూలు: కిమ్స్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి: డీవైఎఫ్ఐ
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కిమ్స్ ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ కర్నూలు జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కార్యాలయంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు హుస్సేన్ బాషా మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం కింద ఏప్రిల్ 5న కిమ్స్ ఆస్పత్రిలో చేరిన వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి బైపాస్ శస్త్రచికిత్స అనంతరం మరణించినట్లు ప్రకటించారని తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స విజయవంతమైందని చెప్పి, రూ. 3 లక్షలు సిద్ధంగా పెట్టుకోవాలని కోరిన కొద్దిసేపటికే బీపీ పడిపోయి ఐసీయూలో మరణించినట్లు ప్రకటించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్