కర్నూలు: ఫీజులపేరుతో హింసిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

1289చూసినవారు
కర్నూలు నగరంలోని భాస్కర్ నగర్‌లోని ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా హింసిస్తున్నట్లు తల్లిదండ్రులు డీఈవో సుధాకర్ కు ఫిర్యాదు చేశారు. గురువారం, 3వ తరగతి విద్యార్థి వై. హర్షనందు తండ్రి నగేష్ డీఈవో సుధాకర్ కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 14, 500 ఫీజు కంటే ఎక్కువగా స్కూల్ రూ. 26, 000 వసూలు చేస్తున్నందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్