కర్నూలు: సీఎంపై అంబాటి అనుచిత వ్యాఖ్యలు.. సొమిశెట్టి ఫైర్

497చూసినవారు
కుడా చైర్మన్ సొమిశెట్టి వెంకటేశ్వర్లు, సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబాటి రాంబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ, "చంద్రబాబు గురించి మాట్లాడే దమ్ము ధైర్యం నీకు ఉందా. చెత్త నోరు మాట్లాడుతుంది. ఫినాల్ తో నోరు కడిగించి ఏమీ చేయాలో అది చేస్తాం జాగ్రత్త" అని హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే నీవు చంద్రబాబు గురించి మాట్లాడుతావా అని ప్రశ్నించారు. గతంలో మంత్రిగా పనిచేసి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్