కర్నూలు: అంబటి తక్షణమే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి

1027చూసినవారు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబటి తక్షణమే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎంపై అసభ్య పదజాలంతో దూషించడం విచారకరమని, అంబటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నాగరాజు తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు బూతుల రాజకీయాలకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్