కర్నూలు: స్వర్ణాంధ్ర లక్ష్యం కోసం అధికారులు కృషి చేయాలి

347చూసినవారు
కర్నూలు: స్వర్ణాంధ్ర లక్ష్యం కోసం అధికారులు కృషి చేయాలి
2047 నాటికి భారత్‌ను వికసిత్ భారత్‌గా, ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంతో అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, వ్యవస్థాపక కార్యాలయాల్లో సమగ్రంగా పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కర్నూలులో చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్స్ సమస్యలను చర్చిస్తూ, ఎస్ హెచ్జీ మోడల్ ద్వారా ఆర్థిక సహాయం, రుణాల ద్వారా జీవితాల్లో మార్పు కల్పించవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్