కర్నూలు: క్యాన్సర్ నియంత్రణకు అవగాహనే ఆయుధం: మంత్రి టీజీ

685చూసినవారు
కర్నూలు: క్యాన్సర్ నియంత్రణకు అవగాహనే ఆయుధం: మంత్రి టీజీ
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కర్నూలులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ, క్యాన్సర్ నియంత్రణకు అవగాహనే ప్రధాన ఆయుధమని, ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని తెలిపారు. బచ్చు జానకిరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు క్యాన్సర్ లక్షణాలు, నివారణ మార్గాలు, ముందస్తు పరీక్షల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. 9 నుండి 14 ఏళ్ల కార్మికుల పిల్లలకు క్యాన్సర్ నిరోధక టీకాలు కూడా వేశారు. ఈ కార్యక్రమం బుధవారం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్