కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి సూచనలతో కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ఈ సదస్సును నిర్వహించారు. మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్. ఆర్. రత్నరూత్, న్యాయవాది విజయ, ప్యారా లీగల్ వాలంటీర్ మధుసూధన్ పాల్గొన్నారు.