కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మార్చి నుండి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, కేంద్ర కార్మిక సంఘాలు ఏప్రిల్ 1న బ్లాక్ డే నిర్వహించాలని పిలుపునిచ్చాయి. సోమవారం కర్నూలులో ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో సిఐటియు, ఏఐటీయూసీ నాయకులు సమావేశమై కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు, నియోజకవర్గ కేంద్రాలు, పనిచేసే ప్రాంతాల్లో నల్లజెండాలతో, బ్లాక్ బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపాలని సూచించారు.