కర్నూలు నగరంలోని రాయలసీమ యూనివర్సిటీలో వీసీతో వాగ్వాదానికి దిగిన ఆర్పీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి. నాగరాజుపై కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 10న జరిగిన సంఘటనపై రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్‌కుమార్ నాయుడు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ పరిపాలనకు, అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజుపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.