కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి శనివారం సెయింట్ జోసెఫ్ కళాశాలలో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంశంపై పొడి, తడి, పారిశుధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాల విభజన గురించి వివరించారు. తడి, పొడి చెత్త వేరు చేయడం, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని సూచించారు. జేసీ నూరుల్ ఖమర్ కూడా విద్యార్థులను ప్రోత్సహించారు.