కర్నూలు: పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించండి: ఆర్వో

740చూసినవారు
కర్నూలు: పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించండి: ఆర్వో
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), ప్రజలు సహకరించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. శుక్రవారం కర్నూలులో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యమని తెలిపారు. ఈ నెల 15 నుంచి బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేస్తారని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తొలగించబడదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్