కర్నూలు: బాల కార్మిక నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం

643చూసినవారు
కర్నూలు: బాల కార్మిక నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కర్నూలులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ, బాల కార్మికులతో పనిచేయించడం చట్టరీత్యా నేరమని, బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం ప్రకారం ఉల్లంఘనలకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. బాల కార్మికులు కనిపిస్తే 1098 లేదా 15100 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం న్యాయ సేవా సదన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు.

సంబంధిత పోస్ట్