కర్నూలు: జీజీహెచ్‌ ఆసుపత్రి అభివృద్ధిపై కలెక్టర్ దృష్టి

594చూసినవారు
కర్నూలు: జీజీహెచ్‌ ఆసుపత్రి అభివృద్ధిపై కలెక్టర్ దృష్టి
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య పరికరాలు, మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడానికి అదనంగా 40 వెంటిలేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు, రెండు మొబైల్ ఎక్స్‌రే యూనిట్లు, ఐదు మహాప్రస్థానం వాహనాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్